సార్వత్రిక సమ్మెకు కాకినాడ పౌరసంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు..


Ens Balu
6
Kakinada
2022-03-27 07:41:40

దేశవ్యాప్తంగా ఈనెల 28,29 తేదీల్లో సార్వత్రిక సమ్మె జయప్రదానికి భారతీయ పౌర సమాజం సంపూర్ణ సంఘీభావం తెలియజే స్తున్నదని పౌరసంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కార్మిక సంక్షేమం కుంటుపడితే దేశఆర్థిక స్వావలంబన విషవలయంలో చిక్కు కుంటోందన్నారు.  కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, అంగన్ వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం మున్నగు స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం, సామాజిక భద్రతపథకాల అమలుతో సర్వీస్ క్రమబద్దీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి  బడ్జెట్ పెంచి పట్టణ నగర ప్రాంతాలకు విస్తరించాలన్నారు. ఆదాయపు పన్ను పరిధిలో లేని కార్మిక కుటుంబాలకు ఆహార ఉపాధికి నెలకు రూ.7,500 ఇవ్వాలని, సంయుక్త కిసాన్ మోర్చా వంటి 6అంశాలపై ఛార్టర్డ్  డిమాండ్స్, కనీస వేతనాల జీవో  అమలు చేయాలన్నా రు. రు.26,500కు కనీస వేతనం పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థల్లో  డిజిన్వెస్ట్ మెంట్ విధానం, జాతీయ మానిటైజేషన్ ఉపసంహరించాల న్నారు. ఉరితాళ్లుగా మారిన 4లేబర్ కోడ్ లు ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ యాక్ట్ రద్దు చేయాలని కాకినాడ పౌరసంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.