ఘనంగా శిష్టకరణం యువత ఉగాది వేడుకలు..
Ens Balu
9
Visakhapatnam
2022-03-29 15:06:24
విశాఖ పౌర గ్రంథాలయంలో ఉగాది వేడుకలు అనే పేరుతో బాలబాలికల చే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం వారికి బహుమతులు అందజేసే కార్యక్రమాన్ని శిష్టకరణం యువత వెల్ఫేర్ సొసైటీ ఎంతో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి కూచిపూడి నాట్యం శ్రీ సాయినాథ్ కళాసమితి నిర్వాహకులు పక్కి అరుణ్ కుమార్ సాయి నేతృత్వంలో విభిన్నమైన కూచిపూడి నృత్యాలు చిన్నారులు వేసి ఆహుతులను మైమరిపించారు. థియేట్రికల్ ఆర్ట్స్ అధినేత నాగరాజు పట్నాయక్ నేతృత్వంలో చిన్నారుల బృందం వివిధ జానపద నృత్యాలను ప్రదర్శించి ప్రపంచంలోని వివిధ దేశాల జానపద నృత్య రీతులను కళ్లకు కట్టినట్లు చూపించారు. వచ్చిన ఆహుతులు సభా వేదిక మీద ఉన్న ప్రత్యేక అతిథులు శిష్టకరణం చిన్నారులు చూపిన ప్రతిభ ను అద్భుతంగా ఉందని అని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన శిష్టకరణం యువత బృందాన్ని ప్రత్యేకంగా అభినందించాలని ఎందుకు అంటే చిన్నారుల్లో ఉండే కళలను ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఆ కళల పట్ల ఆసక్తితో ఉన్నత స్థాయికి చేరుతారని ఈ విధంగా కృషి చేస్తున్నాను మానాపురం సురేష్ కుమార్ ని తప్పక అభినందించాలని వక్తలు ప్రసంగించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిహెచ్ఎంసి కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ శిష్టకరణం యువత ప్రారంభించి రెండు సంవత్సరాల నప్పటికీ ప్రతి నెలా ఏదో సేవా కార్యక్రమం చేస్తూ ఎందరో కళాకారులను ప్రోత్సహిస్తున్నారని అదేవిధంగా ఆపదలో ఉన్న వారికి ఆదుకున్నారని ఈ విధంగా నిరంతరం కార్యక్రమాలు చేసే మానాపురం సురేష్ కుమార్ ని తప్పక అభినందించాలని కులం పట్ల సంఘం పట్ల ఎంతో నిబద్ధతతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు యువత బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘానికి సేవ చేస్తున్న ఉమామహేశ్వర రావుని డబ్బీరు శ్రీకాంత్ ని పక్కి అరుణ్ సాయి కుమార్ ని నాగరాజు పట్నాయక్ , జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివుని కృష్ణ డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని శిష్టకరణం యువత అధ్యక్షులు సదాశివుని రమ శంకర్రావు సురేష్ కుమార్ ల సారథ్యంలో లో ఘనంగా నిర్వహించేందుకు సభ్యులందరూ వీరిని అభినందించారు వీటి ద్వారానే మరిన్ని కార్యక్రమాలు సమాజంలో జరపాలని చిన్నారులను ప్రోత్సహించాలని రమా శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.