చిత్తూరు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా బి .పద్మజ అదనపు బాధ్యతలు గురువారం సాయంత్రం స్వీకరించారు. ఇప్పటివరకు డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసిన ఐ.ఆర్. లీలావతి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ప్రభుత్వం తిరుపతి,తిరుమల సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న బి .పద్మజ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమె ఐ ఆర్ లీలావతి నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది డిడిని మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.