గుర్తుకొస్తున్నాయంటూ 25ఏళ్ల తరువాత కలిసారు..
Ens Balu
22
Krishnadevipeta
2022-04-04 06:49:38
అరేయ్ పొట్టి, ఒరేయ్ చిట్టీ.. ఏంటే సత్య.. చెప్పవే లక్ష్మి.. అరేయ్ మామ.. ఒరేయ్ బావ.. అంటూ ఆ ప్రాంతమంతా ఒక్కటే కోలాహలం.. అంతలో దూరం నుంచి మైకులో పావురమా.. నీ ప్రేమ ఎంత మధురమూ అంటూ ఓ తీయని పాట.. ఏంటి ఇదంతా మీకు ఏదో సినిమా రిహార్సల్ ని తలిపిస్తుంది కదూ.. అలా అనుకుంటే మీరు కూడా 25ఏళ్లు వెనక్కి వెళ్లి మరీ అలోచించాలి..అవునండీ ఈ మాటలన్నీ 25 ఏళ్ల తరువాత ఒకేచోట కలిసిన విశాఖజిల్లా, గొలుగొండ మండలం ఏ.ఎల్.పురం జెడ్పీ హైస్కూలు 1997వ బ్యాచ్ కి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్ధుల ఆత్మీయ కలియక కార్యక్రమంలోనివి.. గుర్తుకొస్తున్నాయి పేరిట క్రిష్ణదేవీపేటలోని అల్లూరి సీతారామరాజు థీమ్ పార్కులో నాటి విద్యార్ధులంతా నేడు కలిసి చేసుకున్న ఆనంద సంబురం. చాలా సంవత్సరాల తరువాత పూర్వవిద్యార్ధులంతా కలిశారేమో వారంత ఒక్కసారిగా పదోతరగతి విద్యార్ధుల్లా మారిపోయి.. ఒరేయ్ ఎన్నేళ్లైందిరా నిన్నుచూసి..చాలా బాగా మారిపోయావ్.. నిన్ను చూసి గుర్తు పట్టలేకపోయాను కానీ..నీ పేరు మాత్రం గుర్తుంది.. ఏంటే నువ్వు అసలు నువ్వు నువ్వేనా..ఇంతలా మారిపోతావా..నేను గుర్తున్నానా నీకు మరిచిపోయావా.. అంటూ ఎంతో ఆనందంగా పలకరించుకొని, నాటి గురుతులను ఒక్కసారి నెమరు వేసుకుని ఎంతో ఆనందంగా గడిపారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5విద్యార్ధులు(పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు), చిటికెల శ్రీనివాసరావు, ఎస్కే అసూన్, ఎర్రానాగేశ్వర్రావు, దుంగల నానాజీ), పడమట మురళి, శివంగి నూకరాజు, యక్కల గ్రుహలక్ష్మి, లగుడు చందన ఒక బ్రుందంగా ఏర్పడి, ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు క్రియేట్ చేసి 85 మంది పూర్వ విద్యార్ధుల పేర్లు, ఫోన్ నెంబర్లు సేకరించారు. ఇదంతా చేయడానకి ఐదు నెలలు సమయం పట్టిందంటే అతిశయోక్తి కాదు. తమ మిత్రుల కోసం శ్రమించి కష్టపడీ మరీ ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఎన్నో ఫోన్లు, మరెన్నో రాయబాలు, ఇంకెన్నో కబుర్లు పంపుకొని వారంతా మొత్తానికి కలుసుకున్నారు. ఇన్నేళ్ల తరువాత కలిసిన వారి కలియికకు ఎంతో తీపి గుర్తుగా ఉండిపోయేలా అల్లూరి సీతారామరాజు పార్కునే తమ ఆత్మీయ కలియకకు వేదిక గా ఎంచుకొని ఉదయం 10 గంటల సాయంత్రం 5 గంటల వరకూ ఎంతో సరదాగా, ఆనందంగా గడిపారు. కొంత మంది పూర్వ విద్యార్ధులు 25ఏళ్ల తరువాత కలవడంతో బావి భావోద్వేగానికి హద్దులు లేకుండా పోయాయి. తమ స్నేహితులందరికీ ఒకే చోట కలుసుకున్నారేమో..ఒక్కసారిగా ఆనందం తట్టుకోలేక కంటతడి సైతం పెట్టుకోవడం అందరినీ ఆలోచింపజేసింది. ఈ అపూర్వ కలయిక కోసం జడ్డంగి రమణ అనే తమ స్నేహితుడు చెన్నై నుంచి.. దుంగల నానాజీ పూనే నుంచి.. ఇలా ఒక్కొక్కరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఇదే బ్యాచ్ కి చెందిన ఓ పూర్వవిద్యార్ధి ఇతర దేశంలోనూ, మరో విద్యార్ధి ఆర్మీలోనూ ఉండటంతో వారంతా ఈ కలయికను వీడియో కాల్ ద్వారా ఆశ్వాదించి ఆనందం పొందారు. చాలా కాలం తరువాత మిత్రులు కలవడంతో సరదగా కలిసి ఫోటోలు, వీడియోలు, సెల్పీలు తీసుకొని తన ఆత్మీయ కలియికకు గుర్తులను మిగిల్చుకొని, మళ్లీ ఎప్పుడు కలుస్తామో అంటూ కొద్ది పాటి బాధను దిగమింగుకొని మరీ సాయంత్రం తిరుగు పయనమయ్యారు. 25ఏళ్ల తరువాత అందరూ ఒకే చోట కలిశారేమో వాళ్ల కలియిక మరపురోజుగా గుర్తుండిపోవడానికి గ్రామం మొత్తం స్వాగత, సుస్వాగతాల బోర్డులు, ఫ్లెక్సీలతో నింపేశారు. దీనితో క్రిష్ణదేవిపేటలో ఏదో జరిగిపోతుందనే హడావిడి 2 రోజుల నుంచే కనిపించేలా చేసి వారి ఆత్మీయ కలయికను అందరికీ గుర్తుండిపోయేలా చేసుకోవడంలో సఫలీక్రుతులు కావడంతోపాటు వాళ్ల తరువాత, ముందు చదువుకున్నవారందరికీ మంచి సందేశానివ్వడంతో పాటు మిగిలిన వారిలోనూ పూర్వివిద్యార్ధులంతా కలవాలనే ఆశను రేపారు. కార్యక్రమంలో 1997 బ్యాచ్ కి చెందిన 10వ తరగతి పూర్వవిద్యార్ధులు 138 విద్యార్ధులకు గాను 85 మంది విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.