ఈనెల 12న అప్పన కళ్యాణమహోత్సవం
Ens Balu
5
Simhachalam
2022-04-06 10:50:32
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం ఈ నెల 12 న ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్టు అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వనితులు, జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఈమేరకు బుదవారం సింహాద్రి నాధుడు ను దర్శించుకున్న శ్రీను బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పారు. 12వ తేది రాత్రి 8.30 గంటలకు రదోత్సవం, అనంతరం కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు దేవస్థానం చేపట్టిందన్నారు. స్వామివారి కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని ఈ సందర్భంగా శ్రీనుబాబు కోరారు.