టిటిడి సివిఎస్వోగా డి.నరసింహ కిషోర్..


Ens Balu
6
Tirumala
2022-04-06 10:59:48

తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా, భద్రతాధికారిగా  డి.నరసింహ కిషోర్ బుధ‌వారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్త‌ సివిఎస్వో  డి.నరసింహ కిషోర్‌ను ప‌దోన్న‌తిపై వెళ్ళుతున్న  గోపినాథ్ జెట్టి అభినందించారు. అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. త‌రువాత‌ వేదపండితులు సివిఎస్వోకు వేద ఆశీర్వచనం అందించారు. ఆల‌య అధికారులు సివిఎస్వోకు శ్రీవారి చిత్ర‌ప‌ట్టంతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు.