విజయనగరం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా జి. కామేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీకార్పోషన్ ద్వారా అందే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ఎస్సీలకు అందించడంలో శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని చెప్పారు. ఈయన ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ కార్పరేషన్ ఈ.వో. పని చేసి పదోన్నతిపై జిల్లాకు విచ్చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.