అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యునిగా గంట్ల


Ens Balu
7
Simhachalam
2022-04-07 03:48:52

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహా లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 235ను రాష్ర్ట దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్.హరిజవహర్ లాల్ విడుదల చేశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా సింహాచలం ప్రాంతానికి చెందిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును నియమించారు. ప్రస్తుతం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న గంట్ల శ్రీనుబాబు గతంలో చందనోత్సవం కమిటీ సభ్యునిగా , పలు అనుబంధ ఆలయాల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేవస్థానం అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గంట్ల శ్రీనుబాబును పాలకమండలి సభ్యునిగా నియమించడం పట్ల పలువురు భక్తులు, సహచర జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పాలకమండలి రెండేళ్ల పాటు సేవలందించనుంది.