అట్టహాసంగా గంట్ల పదవీ బాధ్యతలు..


Ens Balu
5
Simhachalam
2022-04-07 10:15:14

సింహాచలం శ్రీ శ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు గురువారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో ఎంవి సూర్యకళ ఆధ్వర్యంలో సభ్యులు తమ పదవీ ప్రమాణ స్వీకారం  చేపట్టారు. ప్రస్తుతం అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తన పదవికి  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ అప్పన్న దేవస్థానం అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు  చేపట్టడం జరిగిందని ,త్వరలోనే భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు.. త్వరలోనే ప్రహ్లాదకల్యాణ మండపం స్వాధీనము కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఉత్సవాలు విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని శ్రీను బాబు కోరారు. సింహాచలం గ్రామస్తుడుగా ధర్మకర్తల మండలి సభ్యుడిగా  పదవి స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు.. దేవుడికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ,రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయిరెడ్డి ,ఇతర ప్రజాప్రతినిధులకు శ్రీను బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబును ఆలయ అధికారులు, సింహాచలం,అడవివరం గ్రామస్తులు  ఘనంగా సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ట్రస్టుబోర్డ్ సభ్యులంతా పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.