నవరత్నాలు పూర్తిస్థాయిలో అమలు చేయాలి..


Ens Balu
6
Guntur
2022-04-07 15:40:44

ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నవరత్నాల పధకాలు, సంక్షేమ పధకాలను సమర్ధ వంతంగా అమలు చేయడంలో అధికారులు అంతా సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్. సమీర్ శర్మ ఆదేశాలిచ్చారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి 26 జిల్లాల కలెక్టర్లు, కమీషనర్లు, ఆయా శాఖ ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ పధకాల అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ రాజకుమారి, శిక్షణా కలెక్టర్ శుభం బన్సాల్, డి.ఆర్.ఒ కొండయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్. సమీర్ శర్మ మాట్లాడుతూ నవరత్నాలు, జగనన్న పేదలందరికీ ఇల్లు, ఓ.టి.ఎస్. విద్యా దీవెన, వసతి దీవెన, గృహనిర్మాణం, జగనన్న ఆసరా, చేయూత, పాల వెల్లువ, వై.యస్.ఆర్ నేస్తం, గ్రామ/ వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాల నిర్వహణ, సర్వీసులు, ఆధార్ సెంటర్ల నిర్వహణ, వాలటీర్లు, గ్రామ సచివాలయాల సెక్రటరీల ప్రొబీషన్ డిక్లరేషన్ విధానం తదితర పథకాలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. కొత్తగా ఆయా జిల్లాల్లో కలెక్టర్లుగా బాధ్యతలు వారు తమ కర్తవ్య బాధ్యతలను సమన్వంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఎప్పటి కప్పుడు రోజువారి పరిశీలనలు చేయాడంతో పాటు నివేదికలు ఆధారంగా పథకాలను సమర్ధవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ/ వార్డు, గృహనిర్మాణశాఖ ముఖ్య అజయ్ జైన్ ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరును అధికారులకు వివరించి, పురోగతికి సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో హౌసింగ్ పి.డి. వసంతబాబు, ఎస్సీ కార్పోరేషన్ ఇ.డి ప్రేమకుమారి, ఇ.డి.ఎం. రత్నం, డిజాస్టర్ మేనేజ్ మెంట్ పి.డి లలిత, సి.పి.ఒ శేషశ్రీ, డి.పి.ఒ కేశవరెడ్డి, కలెక్టరేట్ ఎ.ఒ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.