విజయసాయిరెడ్డిని కలసిన ఎస్సిఆర్డబ్యుఏ..
Ens Balu
7
Visakhapatnam
2022-04-08 03:14:13
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గురువారం సర్క్యూట్ హౌస్ లో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆయనను దుస్సాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందజేసారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సంబరాలకు సహాయసహకారాలు అందించినందుకు విజయసాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ పలు జర్నలిస్టుల సమస్యలను విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎమ్.వి.ఎస్.అప్పారావు, కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్, ముఖ్య సలహాదారులు కర్రి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పద్మజ, ఎస్.ఎన్.నాయుడు, కోశాధికారి అశోక్ రెడ్డి, సహాయ కార్యదర్శి అబ్బిరెడ్డి చంద్రశేఖర్, సహ సహాయ కార్యదర్శి కె.వినోద్, కార్యవర్గ సభ్యులు వి.సూరిబాబు, విశ్వేశ్వరరెడ్డి, శిరీష తదితరులు పాల్గొన్నారు.