యబ్బోజుకి క్రిష్టియన్ మేరేజ్ లైసెన్స్..
Ens Balu
5
Vizianagaram
2022-04-08 06:43:52
విజయనగరం పట్టణానికి చెందిన పి. యబ్బోజు చౌదరికి, ప్రభుత్వం క్రిష్టియన్ మేరేజ్ లైసెన్స్‌ను జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక స్టేడియం కాలనీలోని గ్రేస్ అండ్ ట్రూత్ చర్ఛికి చెందిన యబ్బోజు చౌదరికి, ఇండియన్ క్రిష్టియన్ మేరేజ్ యాక్ట్ 1872 ప్రకారం, మూడేళ్లపాటు చెల్లేవిధంగా ఈ లైసెన్సును జారీ చేసినట్లు వివరించారు. ఇకనుంచీ జిల్లా పరిధిలో భారతీయ క్రిష్టియన్ల మధ్య జరిగే వివాహాలకు, ఆయన ధృవపత్రాలను జారీ చేస్తారని కలెక్టర్ తెలిపారు.