మనందరి భవిష్యత్తుకి పునాది విద్య..


Ens Balu
8
Rajahmundry
2022-04-08 09:31:59

మన భవిష్యత్తు కి పునాది విద్య , అటువంటి విద్యను పేద, నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత తెలిపారు.  జగనన్న వసతి దీవెన పధకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గ పరిధిలోని  34,261 మంది విద్యార్థులకు చెందిన 30559 మంది తల్లుల ఖాతాలో రూ.32.61 కోట్లు జమ చేసామని జిల్లా కలెక్టర్ డా.మాధవీలత పేర్కొన్నారు. నంద్యాల నుంచి ముఖ్యమంత్రి  పాల్గొన్న సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా   శుక్రవారం ఉదయం  స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో శాసన సభ్యులు జక్కంపూడి రాజా,  తలారి వెంకట్రావు తో కలిసి  కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  జిల్లా కలెక్టర్ గా భాద్యతలు చేపట్టిన తర్వాత జగనన్న విద్యా దీవెన వంటి కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాల్గొనడం ఒక మరుపురాని సంఘటన గా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎంతో ఆలోచించి జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ప్రవేశ పెట్టి అమలు చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి తాను చదువుకో గలను అనే స్టైర్యాన్ని ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కల్పించగలిగారు.  మన భవిష్యత్తు కి పునాది విద్య , అటువంటి విద్యను పేద, నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత తెలిపారు.


ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకుంటూ ఫీజ్ రీయింబర్సు కింద అన్ని వర్గాలకు సమన్యాయం చేసారని తెలిపారు. ఆర్ట్స్ కళాశాల పరిధిలో ని 3,666 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.3.48 కోట్లు జమ చెయ్యడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చెయ్యడం లో బ్రాండ్ అంబాసిడర్ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. తండ్రి ఒక అడుగు వేస్తే తాను రెండడుగులు వేస్తానని చెప్పి ఆచరణలో చూపిన వ్యక్తి జగనన్న అన్నారు. 

విద్యార్థిని ఏ. స్వాతి మాట్లాడుతూ, మా ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్ననని, జగనన్న విద్యా దీవెన సొమ్ము తో కంప్యూటర్ కొనుగోలు చేసాను, ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను, నా వంటి ఎందరో విద్యార్థులకు ఆర్ధిక భరోసా కల్పించి ఉన్నత చదువులు చదివేందుకు ఆస్కారం ఏర్పడిందని తెలిపారు.  సి.సాయి మాట్లాడుతూ, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన  పధకం నా వంటి ఎందరో పేద, నిరుపేద వర్గాల కు ఎంతో తోడ్పాటు అందించిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ విశ్వేశ్వర రావు, జిల్లా షెడ్యూల్, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పిఎన్వీ . సత్యనారాయణ, సూపరింటెండెంట్ పి.దొరబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.