శ్రీకాకుళంజిల్లాకి వసతి దీవెన రూ.51.94 కోట్లు


Ens Balu
6
Srikakulam
2022-04-08 09:45:51

శ్రీకాకుళం జిల్లాకు జగనన్న వసతి దీవెన క్రింద జిల్లాకు 51.94 కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి లైవ్ ద్వారా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు.  శుక్రవారం నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన వసతి దీవెన సభలో ఆయన వర్చువల్ విధానం ద్వారా 2021-22 విద్యా సంవత్సరంనకు సంబంధించి విద్యా దీవెన తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.  శ్రీకాకుళం జిల్లాలో 54,432 మంది విద్యార్థులకు సంబంధించి 49,060 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో 51.94 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు.  ఇందులో 4079 మంది ఎస్.సి విద్యార్థులు 3722 మంది తల్లుల  ఖాతాల్లో 3.89 కోట్ల రూపాయలు, 850 మంది ఎస్.టి విద్యార్థుల తల్లులు 807  మంది ఖాతాల్లో 78.02 లక్షలు, 46,888 మంది బి.సి విద్యార్థుల తల్లులు 42,188 మంది ఖాతాల్లో రూ.44.73 కోట్లు, 1,717 మంది ఇబిసి విద్యార్థుల తల్లులు 1,594 మంది ఖాతాల్లో రూ.1.67 కోట్లు, 165 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థుల తల్లులు 142 మంది ఖాతాల్లో రూ.15.72 లక్షలు, 713 మంది కాపు విద్యార్థుల 675 మంది తల్లుల ఖాతాల్లో 67.80 లక్షల రూపాయలు, 20 మంది క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులకు 16 మంది తల్లులు ఖాతాల్లో రూ.1.95 లక్షలు జమ చేసినట్లు ఆయన చెప్పారు.  

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన పథకం క్రింద జిల్లాలో ఐటిఐ పాలిటెక్నిక్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర ప్రొఫెసనల్ కోర్సులు చదువుకుంటున్న విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ లు లభించనున్నాయని తెలిపారు. ప్రతి విద్యార్థిని, విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థానం అధిరోహించాలని కోరారు. జగనన్న వసతి దీవెన  లైవ్ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి సందేశాన్ని వీక్షించారు.   ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ, రాష్ట్ర మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ బి. హేమామాలిని రెడ్డి,  మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె. వెంకట రత్నం, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కమల, బిసి సంక్షేమ అధికారి ఇ. అనూరాధ, ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు నమూనా చెక్కును అందజేశారు చేసారు.

కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ జిల్లాలో విభిన్న ప్రతిభా వంతులైన ఐ.టి.ఐ నుండి పి.జి వరకు చదువుకున్న, చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు 06 గురికి  ముఖ్య అతిథులు లేప్టాప్ లు అందజేశారు.