శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లకు సేవా పురస్కార కార్యక్రమం మునిసిపల్ కమీషనర్ చల్లా ఓబులేసు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ అనేది గతంలో దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ అని అన్నారు. వాలంటీర్ అంటే వారి వార్డు లో యాభై కుటుంబాలకు బాధ్యత తీసుకునే కుంటుంభ పెద్ద లా వ్యవహారిస్తున్నారు. అని అన్నారు. కరోనా సమయంలో మీరు మీ ప్రాణాలు పణంగా పెట్టి చేసిన సేవలు ఎంత పొగిడిన తక్కువే అని అన్నారు.ఇపుడు మీకు ఈ అవార్డులు గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి. చాలా మంది వాలంటీర్లు కి అవార్డులు ఇవ్వాలి కానీ అందరికి ఇవ్వలేరు. మిగతా వారందరికి కూడా మున్ముందు అవార్డులు వస్తాయి ఇందులో ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదు. గుర్తింపు అనేది రావాల్సిన సమయంలో వస్తాయి మనం వేచి చూడాలి అని అన్నారు.ఈ కార్యక్రమం లో రెవెన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి, శ్రీకాకుళం మునిసిపల్ అసిస్టెంట్ కమీషనర్ జే రామప్పల నాయుడు, కళింగ వైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్,మాజీ మునిసిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, చల్లా అలివేలు మంగ, మైల పల్లి మహాలక్ష్మి మత్య కార డైరెక్టర్, ఊడి శ్యామల, కాపు డైరెక్టర్, మొహమ్మద్ రఫీ రాష్ట్ర మైనారిటీ డైరెక్టర్, పైడి మహేశ్వరరావు, పి. సుగుణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.