జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగంపెంచాలి..


Ens Balu
6
Rajahmundry
2022-04-08 11:38:52

రాష్ట్రంలో  ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని , అందుక నుగుణంగా తూర్పుగోదావరి జిల్లాలో నిర్మాణాలు  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక  సబ్ కలెక్టర్ కార్యాలయలో హౌసింగ్, అనుబంధ  శాఖల అధికారులతో  సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత  మాట్లాడుతూ, జిల్లా పరిధిలో  లబ్దిదారులు ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేసినందున వివిధ దశల్లో ఉన్న వాటిలో తదుపరి పురోగతి సాధించాలన్నారు.  ప్రతి రోజు క్షేత్రస్థాయిలోని సిబ్బంది, అధికారులతో పురోగతి పై సమీక్ష నిర్వహించాలన్నారు. సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి ప్రగతి చూపాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఇళ్ళ నిర్మాణాలు చేసేందుకు ఆసక్తి చూపే కాంట్రాక్టర్లకి అడ్వాన్స్ ఇచ్చి, తదుపరి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసిన తర్వాత సర్దుబాటు చేసే విషయం పై సమగ్ర కార్యాచరణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీక్ష చేస్తున్నందున, ఈ విషయంలో అలసత్వం వహించారదన్నారు. ఈ సమావేశానికి ఆర్డీవో ఎస్. మల్లిబాబు, హౌసింగ్ డిహెచ్ ఓ డి.తారక్ చంద్,   హౌసింగ్  ఈ ఈ లు  జి.సోములు, సిహెచ్. బాబూరావు,డీఈలు ఆర్ వేణు గోపాల్,   జి.పరశురామ్, కె.ఎస్.ఎన్. రెడ్డి, జి.శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.