వారికి గ్రూప్1,2 పరీక్షలకు ఉచిత శిక్షణ..
Ens Balu
11
Vizianagaram
2022-04-08 12:33:02
విజయనగరం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు త్వరలో జరగబోయే బ్యాంకు పీవో, గ్రూప్ -1 పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తిరుపతి, విజయవాడ ఏపీ స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ అందజేయనున్నుట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్ రాజ్ కుమార్ తెలిపారు. పీవో పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి తిరుపతిలోని డా. బి. ఆర్. అంబేద్కర్ ఏపీ స్టడీ సర్కిల్ లో, గ్రూప్-1 పరీక్షకు సన్నద్ధమయ్యే వారికి విజయవాడ బ్రాంచి ఏపీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఉంటుందని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వార్షిక ఆదాయం రూ.6 లక్షలు కలిగిన ఎస్సీ, ఎస్టీ సామాజిక, ఇతర వర్గాలకు చెందిన పట్టభద్రులు ఈ నెల 18వ తేదీ లోగా apstdc.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించటం ద్వారా శిక్షణకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని, ఎంపికైన వారికి ఉచిత వసతి, ఉచిత శిక్షణ అందజేస్తారని వివరించారు.