సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 12న జరగనున్న స్వామి కళ్యాణ మహోత్సవం, మే 3న జరగనున్న అప్పన్న నిజరూప దర్శనం ఉత్సవాలుకి సంబందించి ట్రస్ట్ బోర్డు సభ్యులతో అధికారులు కలసి పూర్తి స్థాయిలో విజయ వంతం చేద్దామని ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ తో కలిసి స్వరూపానంద సరస్వతి స్వామీజీ ని కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు తదుపరి. శుక్రవారం దేవస్థానం కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఈవో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈసందర్భముగా ఉత్సవాలు కి సంబందించిన పలు అంశాలపై బోర్డ్ సభ్యులు తో చర్చించారు. అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఇ ఓ, ఈఈ శ్రీనివాసరాజు బోర్డు సభ్యులకు వివరించారు,, స్వామి కళ్యాణం జరిగే వేదికను అందంగా తీర్చిదిద్దాలని ఇంజనీరింగ్ అధికారులను బోర్డ్ సభ్యులు ఆదేశించారు.. అంతేకాకుండా కళ్యాణ మహోత్సవం కు వచ్చే భక్తులకి ఏటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కళ్యాణ మహోత్సవానికి ఈ యేడాది అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఈవో చెప్పారు. అదేవిధంగా స్వామి కళ్యాణముకి మీడియాకు కూడా గతంలో మాదిరిగానే అనుమతి ఉంటుందన్నారు. కళ్యాణ వేదిక ఎదురుగా గతంలో మాదిరిగా మీడియాపాయింట్ ఉంటుందని ట్రస్ట్ బోర్డు సభ్యులు తెలియజేశారు.. ఈ దిశగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చందనోత్సవానికి సంబంధించి తదుపరి జరిగే ట్రస్ట్ బోర్డు సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆలయ అభివృద్ది లో మీడియా సహకారం అవసరం. కాబట్టి చందనోత్సవం కి కూడా మీడియాకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు సభ్యులు తెలియజేశారు. రాష్ట్రము లో ఇతర ఆలయాల మాదిరిగానే సింహగిరి పైన అందరికి అందుబాటులో మీడియా పాయింట్ ఉంటుందని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు.
సమావేశం లో ఆలయ అధికారులు ట్రస్టు బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్ రాజ్, దొడ్డి రమణ, సువ్వాడ శ్రీదేవి, పాత్రుడు, సతీశ్, నిర్మల, శ్రీదేవి వర్మ, రాధ, రాజేశ్వరీ, చందు తదితరులున్నారు.