రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ శుక్రవారం భాద్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డా.మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసిన కలెక్టర్ డా.మాధవీలత, జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి చరిత్రాత్మకమైన ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి అభివృద్ధి పరచాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని జిల్లా కలెక్టర్ డా.మాధవీలతకు కమిషన్ తెలియజేశారు.