సకాలంలో ప్రజలకు రేషన్ అందించాలి..
Ens Balu
19
Rajahmundry
2022-04-08 13:33:20
ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు ప్రజలందరికీ సకాలంలో అందేలా చూడాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ.ఎస్ పంపిణీ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఎండీయూ వాహనాల ద్వారా జరుగుతున్న రేషన్ పంపిణీ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సరుకులను కార్డుదారులకు సక్రమంగా అందిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించారు. ఏప్రిల్ నెలకు సంబంధించి పీడీఎస్ సరుకుల పంపిణీ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్.. కాకినాడలో పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక మొబైల్ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే పీడీఎస్ సరుకులు అందించే బృహత్తర కార్యక్రమం క్షేత్రస్థాయి అమలుతీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమం సాఫీగా, విజయవంతంగా పూర్తిచేసేందుకు ఎండీయూ ఆపరేటర్లు, వాలంటీర్లకు జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పలు సూచనలు చేశారు.