టీటీడీ కి రూ.30 లక్షలు విరాళం..
Ens Balu
3
Tirumala
2022-04-15 12:34:13
గుంటూరు కు చెందిన వంగా హేమలత అనే భక్తురాలు శుక్రవారం టీటీడీ కి రూ.30 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల క్యాంప్ కార్యాలయంలో తన కుమారుడు శ్రీ శ్రీకాంత్ తో కలసి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు డిడిని అందించారు. ఈ మొత్తం టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ కు ఉపయోగించుకోవాలని దాత కోరారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, శ్రీవారి సర్వదర్శనం అన్ని వర్గాల ప్రజలకు అందించాలని, స్వామివారి సేవలు ప్రపంచ వ్యాప్తం కావాలని కోరారు. ప్రాణదాన ట్రస్టు ద్వారా ఎందరికో సేవలు అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అంతముందు దాత కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.