శ్రీచందనానికి శ్రీనుబాబు రూ.లక్ష విరాళం
Ens Balu
4
Simhachalam
2022-04-15 14:32:21
శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి శ్రీచందన సమర్పణకి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు, తన సన్నిహితుడు బీవీ కృష్ణా రెడ్డితో కలిసి లక్ష రూపాయలు విరాళంటీ సమర్పించారు. తన పుట్టినరోజు సందర్బంగా సింహాద్రినాధుని దర్శనం చేసుకున్న శ్రీనుబాబు విరాళాన్ని దేవాలయ అధికారి తిరుమలేశ్వరరావు, వైదిక పెద్దలు ఆస్థానాచార్యులు డాక్టర్ టీపీ.రాజగోపాల్, హవల్దార్ ఎస్.టీపీ.రాజగోపాల్ కి అందజేశారు. ఇందులో ప్రతీయేటా స్వామివారికి సమర్పించేందుకు 120 కిలోల చందనం చెక్కలు అవసరముంటుంది. ఈనేపథ్యంలో 5 కిలోల గంధం చెక్కల ధరను శ్రీనుబాబు సమర్పించారు. దేవస్థానం అధికారులు అరగదీసిన చందనం ముక్కలను ప్రసాదంగా దాతలకు అందజేశారు. భక్తుడిగా అనేక రూపాల్లో సింహాచలేశుని సేవల్లో భాగస్వామిగా ఉండడం ఆనందంగా ఉందని శ్రీనుబాబు చెప్పారు. ప్రతీయేటా చందనంతో పాటు స్వర్ణతులసీ దళాలు, స్వర్ణపుష్పాలు, నిత్యాన్నదాన పథకానికి లక్షలాది రూపాయలు విరాళంగా సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. కాగా కొండ దిగువ సన్నిహితులు, స్నేహితులు, బంధువులు శ్రీనుబాబు ని సత్కరించారు. పుట్టినరోజు వేడుకలు చేసి కేకు కత్తిరించి ఆనందాన్ని పంచుకున్నారు. భగవంతుడికి చేసిన సేవలకు గుర్తింపుగా ధర్మకర్తల మండలిలో సభ్యత్వం దక్కిందన్నారు. అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమంలో అడివివరం కో ఆపరేటీవ్ సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, డైరెక్టర్ బి.మహేశ్వరరావు, బోర ప్రసాద్ రెడ్డి, దొంతల సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.