ఏజెన్సీకి 6పెట్రోల్ బంకులు మంజూరు


Ens Balu
4
అల్లూరి సీతారామరాజు జిల్లా
2022-04-18 15:25:33

ఏజెన్సీకి కొత్తగా ఆరు పెట్రోలు బంకులు మంజూరు చేసామని ఐటిడి ఏ పి ఓ రోణంకి గోపాల క్రిష్ణ స్పష్టం చేసారు. ఐటిడిఏ వీడియో కాన్ఫరెన్స్ హాలులో పెట్రోలు బంకులు ఏర్పాటుపై రెవెన్యూ ,పోలీస్, గిరిజన సంక్షేమ,రహదారులు భవనాల శాఖల ఇంజనీరింగ్ అధికారులు, వైద్యా ఆరోగ్యశాఖ, అగ్నిమాపకశాఖ, హెచ్‌పిసిఎల్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ బంకులు నిర్మాణాలకు అవసరమైన అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. అనంతగిరి మండల కేంద్రంలోను,అరకువ్యాలీ మండలం పానిరంగిని, కొయ్యూరు మండలం నడింపాలెం, పాడేరు మండలం తలారిసింగి, ముంచంగిపుట్టు మండలం లుంగాపుట్టు, చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో పెట్రోలు బంకులు నిర్మిస్తామన్నారు. ఈనెల 23 వతేదీలోగా నోఅబ్జెక్షన్ సర్టిఫికేట్లు జారీ చేయాలని రెవెన్యూ,ఫైర్,పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ,రహదారులు భవనాలశాఖ అధికారులకు సూచించారు. పెట్రోల్ బంకుల నిర్మాణానికి అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి జూన్ మొదటి వారంలో నిర్మాణపు పనులు ప్రారంభించాలని చెప్పారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ వి. అభిషేక్, ఎ ఎస్‌పి జగదీష్, ఎపి ఓ జనరల్ వి. ఎస్.ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ లు డివి ఆర్ ఎం రాజు, కె. వేణుగోపాల్, ఆర్ అండ్ బి ఇ ఇ బాల సుందరరావు, హెచ్‌పిసిల్ అధికారులు,తాహశీల్దారులు,అగ్నిమాపకశాఖ తదితరులు పాల్గొన్నారు.