బర్ద్ లో అధునాతన సిటీ స్కాన్..
Ens Balu
3
Tirupati
2022-04-18 15:32:41
తిరుపతిలోని బర్ద్ ఆస్పత్రిలో అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన ధర్మ పాల్ సత్య పాల్ గ్రూప్ సంస్థ రూ 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువచేసే సిటి స్కాన్ యంత్రాన్ని ఆస్పత్రికి విరాళంగా అందించింది. ఈ సందర్భంగా ధర్మారెడ్డి శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి సిటీ స్కాన్ యంత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తిరుపతి జేఈవో వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డప్ప రెడ్డి, ధర్మ పాల్ సత్యపాల్ గ్రూప్ డైరెక్టర్ అతుల్ జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదనపు ఈవో ధర్మారెడ్డి దాత అతుల్ జైన్ ను శాలువాతో సన్మానించి శ్రీవారి చిత్ర పటం, ప్రసాదాలను అందించారు.