గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు కృషి..


Ens Balu
6
అల్లూరి సీతారామరాజు జిల్లా
2022-04-18 15:54:27

అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని గిరిజనుల ఆరోగ్య పరి రక్షణకు కృషి చేస్తామని  కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అదేశాలు మేరకు ఆజాదికా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని బ్లాక్ స్థాయిలో మెగా హెల్త్ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సోమవారం స్థానిక తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన హెల్త్ మేళాను ఐటిడిఎ పి.ఓ. రోణంకి గోపాల క్రిష్ణ, పాడేరు శాసనసభ్యురాలు కె.భాగలక్ష్మి తో కలిసి ప్రారంభించారు. స్త్రీల వైద్య విభాగం, చిన్న పిల్లలు, సాధారణ వైద్య సేవలు, రెడ్ క్రాస్ రక్త దానం శిబిరం, క్షయ విభాగం,ఉచిత మందులు పంపిణీ విభాగాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు డివిజన్లలో మెగా హెల్త్ మేళాలు నిర్వహిస్తామని చెప్పారు.ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రతి15 రోజులకు ఒక మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని అన్నారు. రెడ్ క్రాస్ చేసిన ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఐదు వందల నుండి వెయ్యి మంది వైద్య శిబిరానికి వస్తారని అంచనా వేశామని అన్నారు. వైద్యశిబిరానికి వచ్చే రోగులకు హెల్త్ ఐ డి జనరేట్ చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియ జేశారు.  ఈ కార్యక్రమంలో   ఎస్ పి సతీష్ కుమార్ ,ఎ పి మెడికల్ కౌన్సిల్ సభ్యులు టి.నర్సింగరావు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎల్.రామ్మోహన్, అదనపు జిల్లా వైద్యాధికారి డా.లీలాప్రసాద్, పి.ఓ.డీడీ టి డా. టి. విశ్వేశ్వర నాయుడు, డిసిహెచ్ ఎస్ డా.హరి, డిఎల్పీఓ పీఎస్ కుమార్౩,ఎంపిడిఓ నరసింహారావు, తహసీల్దార్ వి.ప్రకాశరావు, రెడ్ కార్యదర్శి,పలువురు వైద్య నిపుణులు,ఎస్ టి కమిషన్ సభ్యులు జె.లిల్లీ సురేష్, కె.ఆర్.కె.రాజు తదితరులు పాల్గొన్నారు.