కక్షిదారులకు సమన్యాయం చేసే విధంగా క్రుషి చేస్తానని, ప్రభుత్వ సేవలు అందించడా నికి పూర్తిస్థాయిలో క్రుషిచేస్తానని రాజమహేంద్రవరం జిల్లా కోర్ట్ లో జిల్లా ప్రధాన న్యాయ మూర్తి పి.వెంకట జ్యోతిర్మ యి పేర్కొన్నారు. సోమవారం జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలు లో జిల్లా ప్రధాన న్యా య మూర్తి గా విధులు నిర్వర్తిం చి, బదిలీ పైరాజమహేంద్రవరం జిల్లా కోర్ట్ కి వచ్చినట్టు పేర్కొన్నారు. పాత తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న 3 జిల్లాల కోర్టులు తన పరిధిలో కి వస్తాయన్నారు. అనంతరం కోర్ట్ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది జడ్జిని మర్యాద పూర్వకంగా కలిసి విభాగాల వారీగా పరిచయాలు సచేకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు కార్యాలయ సిబ్బంది, పలువురు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.