అమర్నాధ్ పైనే అనకాపల్లిజిల్లా ఆశలు..
Ens Balu
7
Anakapalle
2022-04-19 02:08:54
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఒకటైన అనకాపల్లిజిల్లా ప్రజలు ఆశలన్నీ ఇపుడు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి గుడివాడ్ అమర్నాద్ పైనే పెట్టుకున్నారు. ఇటీవ లే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకి వచ్చిన అమర్నాధ్ బిజీ బిజీగా గడుపుతు న్నప్పటికీ.. కొత్తజిల్లాలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది, పోలీసుల కూర్పుపైనే ద్రుష్టి సారించినట్టు తెలుస్తుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే కొత్తజిల్లాల్లో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలని.. దానికోసం రాష్ట్ర స్థాయిలో పనిచేసిన అధికారులు ఎవరు బాగా పనిచేస్తారో తెలుసుకునే పనిలో పడినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం వివిధ అద్దె భవనాలు, ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న జిల్లాశాఖల ప్రభుత్వ కార్యాలయాలకు ఒకే వేదికగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ బాద్యతలు కూడా మంత్రి అమర్నాధ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే చాలా జిల్లా శాఖలకు అధికారులు, సిబ్బంది నియామకాలు కాకపోవడం, పూర్తిస్థాయిలో పరిపాలన అందుబాటులోకి రాకపోవడంపై మంత్రి ప్రత్యేకంగా ద్రుష్టిసారించారని అనుచరగణం చెబుతోంది. ఆది నుంచి పరిపాలనపై మంచి పట్టువున్న యువ ఎమ్మెల్యేగా అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్నాధ్ తన అనుభవాన్ని మొత్తం జోడిండి జిల్లాను పూర్తిస్థాయి జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నారని.. అందుకే కొత్త జిల్లా అనకాపల్లి ప్రజలు ఆశలన్నీ మంత్రి అమర్నాద్ పైనే పెట్టుకున్నారని చెబుతున్నారు. అందులోనూ ఐటి శాఖ కూడా కట్టబెట్టడంతో కొత్త జిల్లాలో కూడా ఐటీ కంపెనీలు తీసుకువచ్చి..తాను ప్రాతినిథ్యం వహించే నూతన జిల్లాను రాష్ట్రంలో సరికొత్తగా ఆవిష్కరించేందుకు ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. తండ్రి దివంగత గుడివాడ గురునాధరావు బాటలోనే నడుస్తూ.. అభివ్రుద్ధేకి తొలి ప్రాధాన్యత ఇచ్చి విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌళిక సదుపాయాల విషయంలో పూర్తిస్థాయిలో ద్రుష్టి కేంద్రీకరించడం ద్వారా ప్రజలకు కావాల్సిన సదుపాయాలు సమకూర్చినట్టు కూడా అవుతుందని, తద్వారా తన నియోజకవర్గ ప్రజలకు అభివ్రుద్ధినే బహుమతిగా ఇవ్వాలని ధ్రుడ సంకల్పంతోనే ముందుకు సాగుతున్నారే సంకేతాలు వినిపిస్తున్నాయి. యువ మంత్రిగా అనకాపల్లిని అన్ని రకాలుగా అభివ్రుద్ధి చేస్తారనే నమ్మకాన్ని యువత నుంచి పెద్దవల వరకూ అందరూ అనేక రకాల ఊహాగానాలు వెలిబుచ్చుతున్నారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగం మళ్లీ ఊపందుకున్న తరుణంలో అనకాపల్లిజిల్లాకి ఐటీ కంపెనీలు తరలివస్తే ఈ ప్రాంతం రాష్ట్రంలోనే మంచి జిల్లాగా పేరుతెచ్చుకోవడంతోపాటు, మరిన్ని విద్యాసంస్థలు, కర్మాగారాలు, పరిశ్రమలు కూడా రావడానికి అశకాశం వుంటుందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అలా జరగాలంటే ఒక్క జిల్లా మంత్రి ద్వారానే అది సాధ్యపడుతుంది. దానికి పరిపాలన, ప్రభుత్వశాఖలు, జిల్లా అధికారుల వ్యవహార శైలిపై అనుభవం ఉంటే తప్పా ఇవన్నీ జరిగే పరిస్థితి ఉండదు. వయస్సులో చిన్నవాడైనా, రాజకీయంలోనూ, అధికారుల విషయంలో చాలా చక్కగా పరిపాలన, సేవలు అందించడంలో ముందుండే మంత్రి గుడివాడ అమర్నాధ్ అనకాపల్లి జిల్లాను రాష్ట్రంలోనే ఒక మంచి జిల్లాగా తీర్చిదిద్దడంతో తనదైన ముద్రవేసుకుంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అనకాపల్లి జిల్లా వాసుల అభివ్రుద్ధి కల యువ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఏ స్థాయిలో కార్యరూపంలోకి తీసుకు వచ్చి చూపిస్తారో వేచిచూడాల్సిందే ..!