అన్న‌దానానికి దాతలు ముందుకురావాలి


Ens Balu
9
Srikurmam
2022-04-19 11:48:31

శ్రీకాకుళం జిల్లా శ్రీ‌కూర్మంలో వెలసిన శ్రీకూర్మనాథ స్వామి వారి దేవస్థానంలో దాతలు, భక్తులు సమర్పించిన  విరాళాలతో నిత్య అన్నదాన కార్యక్రమం త్వ‌ర‌లో ప్రారంభం కానుందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.  మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో భక్తులు సమర్పించిన రూ.2 లక్షల విరాళాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.విజయకుమార్ కు అందజేశారు. శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అంధవరపు శ్రీనివాసరావు రూ.ఒక లక్ష, విశాఖపట్నం జిల్లా గాజువాకకి చెందిన వ్యాపారవేత్త నారాయణశెట్టి మురళి రూ.లక్ష   చెక్కులను సమర్పించినట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇదేవిధంగా దాతలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, ఆలయ కార్య నిర్వహణాధికారి ఎస్.విజయకుమార్, పాలక మండలి సభ్యులు డబ్బీరు వాసు, రాష్ట్ర నాటక అకాడమీ సంచాలకులు ముంజేటి కృష్ణ, బరాటం నాగేశ్వరరావు, ఎస్.వి.డి హోటల్ అధినేత మురళి,  తదితరులు పాల్గొన్నారు.