విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కు సత్కారం
Ens Balu
9
Visakhapatnam
2022-04-19 12:30:30
విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు ను మంగళవారం అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భముగా పలు అంశాలపై చైర్మన్ తో చర్చించారు. అనంతరం చైర్మన్ ను ఘనంగా సన్మానించి, సింహాద్రి నాధుడు జ్ఞాపికను శ్రీనుబాబు బహుకరించారు. సింహాచలంలో అప్పన్న నిజరూప దర్శనం, ఇతర ఉత్సవాల విశిష్టతను శ్రీను బాబు రామ్ మోహన్ రావు కి విపులముగా తెలియజేశారు. అత్యంత మహిమ గల స్వామి సింహాద్రి నాధుడు ఆని, ప్రపంచం లోనే వరాహ,నరసింహ అవతారాల కలయిక ఒక్క సింహాచలం కు మాత్రమే సొంతం అని శ్రీనుబాబు వివరించారు.