ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది.. పోస్టు గాల్లో.. విధులు మాత్రం పోలీసుశాఖలో..?!


Ens Balu
25
visakhapatnam
2025-04-21 13:12:22

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులను పోలీసులుగా ఎలా పరిగణిస్తారు.. వారంతా పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డుద్వారా కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా పోలీసు శాఖలోకి వస్తే పోలీసులైపోతారా అంటూ కోర్టుకేసు.. నిజమే వీరుపోలీలుసు కాదు.. వీరికి పోలీసుశాఖకూ ఎలాంటి సంబంధమూ లేదంటూ సాక్షాత్తూ డిజీపి కార్యాలయం హైకోర్టుకి లిఖిత పూర్వకంగా అఫడవిట్ రాసిచ్చేసింది.. అప్పటి నుంచి ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసుల పోస్టు గాల్లోనే ఉంది.. పోలీసుశాఖ ద్వారా నియామకాలు చేశారు కనుక.. పోలీసుశాఖ నుంచే జీతాలు ఇస్తున్నారు.. పోస్టు సచివాలయశాఖలో బర్తీ చేశారు కనుక జీతం అక్కడి నుంచి వస్తోంది.. అంతే తప్పితే వీరి పోస్టు మాత్రం నేటికీ గాల్లోనే ఉంది..ఈ పరిస్థితి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వం వరకూ అలాగే ఉండిపోయింది. నాటి ప్రభుత్వం మహిళా పోలీసుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుకుండా వదిలేసింది.. కానీ కూటమి ప్రభుత్వం ఏదోఒక నిర్ణయం తీసుకొని వారిని సముచిత స్థానంలో కూర్చోబెడతామని అసెంబ్లీలోనూ, మీడియాలో తెగ ప్రచారం చేసినా కూటమి ప్రభుత్వం కూడా తికమక వ్యవహారాలే చేస్తున్నది తప్పా మహిళా పోలీసులను నిర్ధిష్టంగా ఏం చేస్తుందనే విషయాన్ని మాత్రం తేల్చడం లేదు. వెరసీ ఈ మహిళా పోలీసుల పోస్టు, శాఖ గాల్లోనే ఉండగా.. వీరు మాత్రం అధికారికంగా పోలీసుశాఖలోని పోలీసులు విధులే చేస్తున్నారు.. అంటే ఇక్కడ కోర్టు పని కోర్టుది.. ప్రభుత్వ పని ప్రభుత్వానిది.. లేదా హైకోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నట్టుగానే బావించాలా..?!

ఒక ప్రభుత్వ ఉద్యోగి అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు..అక్కడ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా కోర్టుకి ఏవిధంగా రాసి ఇస్తే ఆవిధంగానే రాష్ట్రప్రభుత్వం వ్యవహరించాల్సి వుంది. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే.. తేడాగానే వ్యవహరిస్తున్నది కూటమి ప్రభుత్వం కూడా అధికూడా అధికారికంగా.  పోలీసు పోస్టు  కాదు కానీ.. విధులు  మాత్రం అధికారంగా చేయిస్తూ... హైకోర్టు దాఖలు చేసిన అఫడివిట్ ని వక్రీకరిస్తూ.. గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల విషయంలో జరుగుతున్న తేడా వ్యవహారం మరోసారి రచ్చకెక్కేటట్టు కనిపిస్తున్నది. మహిళా పోలీసులు గాల్లో ఉన్నారనీ, వారికి తలా తోకా లేదని.. వారికి ప్రభుత్వశాఖ కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇపుడు ఉద్యోగులకు ఇష్టం లేకుండా నేరుగా అగ్రీగోల్డ్ వ్యవహారంలో సమాచారం సేకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని కొంతమందిని పోలీసుశాఖ అభ్యర్ధన మేరకు సచివాలయ మహిళా పోలీసులను సీఐడికి అప్పగిస్తూ లిఖితపూర్వకంగా సర్క్యులర్ లను జారీ అయ్యాయి. అలా విశాఖపట్నంలో కూడా 60మందిని జివిఎంసీ నుంచి పోలీసుశాఖకు కేటాయిస్తు జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. 

 గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వశాఖను కేటాయించకుండానే అధికారికంగా పోలీసుల విధులు చేయిస్తున్న వైనం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంది. ఈ తేడా వ్యవహారంలో మరోసారి మహిళాపోలీసుల పోస్టు కూడా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళా పోలీసులు నియామకాలు పోలీసుశాఖ ద్వారానే జరిగినా.. కోర్టు కేసు, కోర్టుకి దాఖలు చేసిన అఫడవిట్(మహిళా పోలీసులకి, పోలీసుశాఖకి సంబంధం లేదు. వీరు పోలీసులు కాదు అని రాచ్చిన)  కారణంగా వీరంతా ఇపుడు పోలీసుశాఖకు చెందిన వారు కాదు. ప్రస్తుతం సచివాలయశాఖకు కేటాయించబడ్డ ఒక సాధారణశాఖలేని ఉద్యోగులు మాత్రమే. అలాంటి సందర్భంలో కోర్టుకి ఇచ్చిన అఫడివట్ ని కాదని మహిళా పోలీసులను ఏ నిబంధనలతో మళ్లీ అగ్రీగోల్డు సమాచారం సేకరించడానికి వీరిని పోలీసుశాఖలోని  సిఐడీ విభాగాని డిప్యుటేషన్ పై పంపిస్తున్నారో తెలియని పరిస్థితి. అలాగని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లస్టర్ విధానంలో రెండు మూడు సచివాలయాలను ఒక సచివాలయం మదించారు. ఆ సమయంలో కొందరు మహిళా పోలీసుల పోస్టులను గాల్లో పెట్టినట్టు లిఖిత పూర్వకంగా తెలియజేసినా. వారిని ఏం చేస్తున్నారో ఎక్కడా మరే ఇతర సర్క్యులర్ లోనూ తెలియజేయలేదు.

కానీ రాష్ట్రప్రభుత్వం ప్రకటించినట్టుగా మాత్రం గ్రామ, వార్డు సచివాలయశాఖ సిబ్బందిని మల్టీటాస్కింగ్ స్టాఫ్ గా వినియోగిస్తామన్న మాటకు వారిని ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పంపేస్తూ సర్క్యులర్ ఇస్తున్నారు తప్పితే.. వారికి ఏ ప్రభుత్వశాఖ కేటాయిస్తున్నారో మాత్రం ఎక్కడా పేర్కొన లేదు. ఇటీవల ఇదే విషయమై హోం మంత్రి వంగల పూడి అనిత కూడా ఒక కీలక ప్రకటన చేశారు. సచివాలయ మహిళా పోలీసుల రిక్రూట్ మెంట్ అంతా తలా తోక లేకుండా అస్తవ్యస్తంగా చేశారని.. వారి చదువు, వయస్సు ఆధారంగా వారిని ఒక సముచితస్థానంలో కూర్చోబెడతామని ప్రకటన  చేశారు. అయితే అలా ప్రకటన చేసిన తరువాతే క్లస్టర్ విధానం తెరమీదకు వచ్చి రాష్ట్రవ్యాప్తంగా కొందరు మహిళా పోలీసుల పోస్టులను రద్దుచేశారు.. అంటే ఉన్న పోస్టులను మధించారు. అలా ఏ సచివాలయంలో పోస్టు మధించారో లిఖితపూర్వకంగా కూడా తెలియజేశారు కూడా. ఆ విధంగా గాల్లో పెట్టిన వారిని ఏం చేస్తారు.. ఏ ప్రభుత్వశాఖకు పంపిస్తారు అనే విషయం క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఇపుడు మళ్లీ తాజాగా సచివాలయశాఖ మహిళా పోలీసులను సిఐడీకి డిప్యూటేషన్ పై అగ్రిగోల్డ్ సమాచార సేకరణకు కావాలంటూ పోలీసుశాఖే జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయడంతో దాని ఆధారంగా కొందరు సిబ్బందిని సిఐడి విభాగానాకి డిప్యూటేషన్ పై పంపిస్తూ సర్క్యులర్ లు జారీచేశారు.

మహిళా పోలీసులను సిఐడీకి అదనపు బాధ్యతలపై పంపేటపుడు ఇక్కడ ప్రధానంగా ఐదు అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంది.. 1)వీరి ఉద్యోగాలు కేసు కోర్టులో ఉండటం 2)పోలీసుశాఖే వీరు మహిళా పోలీసులు కాదు.. వీరికి పోలీసుశాఖకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకి అఫడవిట్ దాఖలు చేసిన విధానం 3)కోర్టు కేసు కారణంగా నేటి వరకూ ఏ ప్రభుత్వశాఖు చెందని ఉద్యోగులు మహిళా పోలీసులు గాల్లో ఉండిపోవడం 4)క్లస్టర్ విధానంతో కొంమంది పోస్టులను రద్దు చేస్తున్నట్టు లిఖిత పూర్వకంగా ప్రకటించడం 5) వారిని తిరిగి ఎక్కడైనా ఖాళీలు ఉన్నచోట భర్తీచేశారా అనే విషయాన్ని తెలుసుకోవడం. అవేమీ చేయకుండానే నేరుగా పోలీసుశాఖ అడిగిందనే ఒకే ఒక కారణంతో జిల్లా కలెక్టర్ నేరుగా 60 మంది మహిళా పోలీసులు లేదా మహిళా సంరక్షకులను సిఐడీ అప్పగిస్తూ సర్క్యులర్ ను జారీచేయడం. అంటే మహిళా పోలీసుల విషయంలో ఉన్న కోర్టు కేసులు, కోర్టులో సమర్పించిన అఫడవిట్ ను కాదని సిబ్బందిని అప్పగించడం దేనికి సంకేతం అనేది జిల్లా కలెక్టర్, రాష్ట్రప్రభుత్వం చెప్పాల్సి ఉన్నది. ఇక్కడ ఉన్న ఒకే ఒక్క అవకాశం ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగడానికి జిల్లా కలెక్టర్ కు ఉన్న జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఆ సర్క్యులర్ జారీచేశారా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. 

ఈ విషయాలన్నింటినీ ఈరోజు-ఈఎన్ఎస్ ఎప్పటినుంచో ప్రత్యేక కథనాలుగా  అందిస్తూ వస్తున్నది. అలా ఏవైతే కథనాల వస్తున్నాయో.. నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో రాష్ట్రప్రభుత్వం ఆ విధంగా చేసుకుంటూ వెళుతున్నది. అంటే ఈరోజు-ఈఎన్ఎస్ రాస్తున్న కథనాలన్నీ నిజమవుతున్నాయి. ఈ విషయంలో ఇక్కడ తప్పా మరే ఇతర ప్రధాన పత్రికలు, మీడియాలోనూ రాకపోవడం కూడా సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాకుండా ఉండిపోతున్నాయి. ఇదే విషయమై  విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ ను ఈరోజు-ఈఎన్ఎస్ చరవాణిలో లిఖిత పూర్వకంగా వివరణ కోరగా ఆయన స్పందించలేదు. కాగా ప్రస్తుతం మహిళా పోలీసుల్లో చాలా మందికి పోలీసు విభాగంలో పనిచేయడానికి ఇష్టంలేదనే అంశాలన్ని వారి చరవాణి గ్రూపుల్లో పెద్ద చర్చకు తెరలేపారు. అసలు ప్రభుత్వశాఖే లేని మహిళా పోలీసులను ఏ విధంగా అదే పోలీసుశాఖలోని సిఐడీకి డిప్యూటేషన్ పై పంపుతున్నారనే అంశం చర్చనీయాంశం అవుతుంది...?!
సిఫార్సు