ఓట్ల లెక్కింపునకు ర్యాండమైజేషన్..
Ens Balu
2
Vizianagaram
2021-03-13 15:57:50
మున్సిపల్ ఎన్నికల ఓట్లను లెక్కించేందుకు గానూ, ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని కేటాయించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఐసి కార్యాలయంలో శనివారం కంప్యూటర్ ద్వారా ఈ ప్రక్రియను నిర్వహించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయితీలకు ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు టేబుళ్లవారీగా ర్యాండమైజేన్ నిర్వహించి, కౌంటింగ్ సూపర్‌వైజర్, సహాయకులను ఎంపిక చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో సుమారు 100 మంది సూపర్‌వైజర్లు, 200 మంది సహాయకులు విధులను నిర్వహించనున్నారు. ఈ ర్యాండమైజేన్ ప్రక్రియలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, డిఐఓ ఆర్.నరేంద్ర, ఏడిఐఓ ఏ.బాల సుబ్రమణ్యం, కలెక్టరేట్ ఏఓ దేవ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.