ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పాటించాల్సిందే..
Ens Balu
1
అనంతపురం
2021-03-13 16:05:39
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పక్కాగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హిందూపురం ఎంజీఎం మున్సిపల్ హైస్కూలు లో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ సెంటర్ లో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. కౌంటింగ్ ను వీడియో తీయించాలని, కౌంటింగ్ కేంద్రంలో నీటి సరఫరా చేపట్టాలని, విద్యుత్ నియంత్రణ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మీడియో కేంద్రం ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్వరితగతిన కౌంటింగ్ పూర్తి చేసేలా పకడ్బందీగా అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిఎస్పీ మహబూబ్ బాషా, తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపాలిటీ డి ఈ మల్లికార్జున, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.