ఉపాధ్యాయులు ఓటు సద్వినియోగం చేసుకోవాలి..
Ens Balu
3
Rajahmundry
2021-03-13 16:14:21
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈనెల 14వ తేదీ ఆదివారం ఉపాధ్యాయులు తమ తమ ఓటుహక్కును నిర్బయంగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పటిష్టంగావించడం జరిగిందని సబ్ కలెక్టరు అనుపమ అంజలి అన్నారు. శనివారం ఆమె స్దానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రంలో బ్యాలెట్ పేపర్లు సీళ్లను ఓపెన్ చేసి బ్యాలెట్ పేపర్లు విభజించి ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన సిబ్బందికి అందజేసారు, అనంతరం వారు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పోలీసు బలగాలతో బస్సులలో బయలుదేరి వెళ్లారు, డివిజన్‌లో పొలింగ్ పక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్నిరకాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని పోలింగ్ వారికి కేటాయించిన విధులు, భాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ పోలింగ్‌ను స్చేచ్చాయుత వాతావరణంలో అప్రమత్తతో నిర్వహించాలని ఆమె పోలింగ్ సిబ్బందికి సూచించారు.పోలింగ్ కేంద్రాలలో అన్నిరకాలు కనీసవసతులు కల్పించడం జరిగిందని పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని ఆమె పోలింగ్ పిబ్బందికి సూచించారు.పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలు పరిరక్షణకు పోలీసు యంత్రాంగం పక్కాగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం వారి నిబంధనలు అన్ని తప్పసరిగా పాటించాలని ఆమె స్ఫష్టం చేసారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన కనీసవసతులు అన్నింటికి ఆయా కేంద్రాల వద్ద కల్పించడం జరిగిందన్నారు. డివిజన్ పరిధిలో మూడు జోన్లు, మూడు రూటుగాను విభజించడం జరిగిందన్నారు. డివిజన్ పరిధిలో 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఉదమం 8 గంటలనుండి సాయంత్ర 4 గంటలవరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 5 గురు పోలింగు సిబ్బందితోపాటుగా మరోకరిని వెబ్ కాస్టింగు కొరకు నియమించడం జరిగిందన్నారు. 1,923 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసారు. రిసెప్షన్ కేంద్రం కాకినాడలోని జెఎన్‌టియులో ఏర్పాటు చేయడం జరిగిందని పోలింగ్ పక్రియ ముగిసిన పిదప బ్యాలెట్ బ్యాక్సులను ఇతర పోలింగ్ సామాగ్రిని కాకినాడలో అప్పగించాలన్నారు. ఈనెల 17వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ కాకినాడ జెఎన్‌టియు విశ్వవిద్యాలయంలో ఉంటుందన్నారు. అనంతరం ఆమె కోరుకొండలోని మండల ఎడ్యుకేషన్ రిసోర్సు సెంటరు నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయపు పరిపాలనాధికారిణి దేవి. కొరుకొండ మండల తాహసిల్దారు పాపారావు, ఎంపిడిఓ నరేష్‌కుమార్ డిప్యూటీ డిప్యూటీ తాహసిల్దార్లు పవన్, పరిమిళ, రెవిన్యూ సిబ్బంది రాము తదితరులు పాల్గోన్నారు.