శ్రీకాకుళంలో కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
3
Srikakulam
2021-03-13 18:58:53
శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం జరగనున్న ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ కౌంటింగ్ ఏర్పాట్లుతో పాటు బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి మున్సిపాలిటీలో రెండు కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించామని చెప్పారు. ఇచ్చాపురంకు సుమిత్ కుమార్, పలాసకు డాక్టర్ కే. శ్రీనివాసులు, పాలకొండకు ఆర్. శ్రీరాములు నాయుడును ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు ఆయన చెప్పారు. ఇచ్చాపురం లో జ్ఞాన భారతి స్కూల్ లో, పలాసలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను, పాలకొండలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా పోలీసు శాఖ బందోబస్తును గట్టిగా ఏర్పాటు చేస్తూ మూడు పట్టణాల్లోనూ సెక్షన్ 30 ను అమలు చేయడం జరిగింది. పోలీసు కవాతు లను కూడా పట్టణాల్లో నిర్వహించి బందోబస్తు ఏర్పాట్లు గట్టిగా చేసినట్లు తెలియజేశారు. పాలకొండలో 18 వార్డులకు ఎన్నికలు జరుగగా 14,600 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలాస - కాశీబుగ్గలో 29 వార్డులకు ఎన్నికలు జరుగగా 31,356 మంది, ఇచ్చాపురంలో 23 వార్డులు వార్డులకు ఎన్నికలు జాతుగాగా 20,433 మంది వెరసి 70 వార్డులులో 66,389 మంది అనగా 72.5 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.