వేద పాఠశాల విద్యార్థులకు ప్రోటీన్ పౌడర్..
Ens Balu
2
తిరుపతి
2021-03-13 21:06:29
తిరుమల ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులకు తిరుపతిలోని స్వీమ్స్ జనరిక్ మెడికల్ షాపువారు రూ.45 వేలు విలువైన జన ఔషధి ప్రోటీన్ పౌడర్‌ను శనివారం సాయంత్రం అందించారు. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు స్వీమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు, ధర్మగిరి వేద పాఠశాలలోని అధ్యాపకులకు, విద్యార్థులకు అందించారు. దీనిని పాలలో కలిపి తాగడం వలన శరీరంలో హ్యూమినిటి పెరుగుతుందని దాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరిక్ మెడికల్ షాపు ప్రొప్రైటర్ రవికుమార్, ఇంచార్జ్ మూర్తి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.