విశాఖలో దుమ్మురేపిన విశాఖ నగర అధ్యక్షుడు వంశీ..


Ens Balu
3
విశాఖపట్నం
2021-03-14 15:25:01

 వైఎస్సార్సీపీ మహావిశాఖ నగర అధ్యక్షులు సిహెచ్.వంశీక్రిష్ణ శ్రీనివాస్ జివిఎంసీ ఎన్నికల్లో దుమ్మురేపారు..ఏకంగా 4వేల ఓట్ల మెజార్టీలో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా వంశీ ముందు నిలవలేకపోయింది. ఆది నుంచి జివిఎంసీ మేయర్ అభ్యర్ధిగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వంశీ గెలుపు, మెజార్టీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే సమయంలో ప్రత్యర్ధులు ఫ్యాన్ గాలికి ఎగిరిపోయారు. అందరూ అనుకున్నట్టుగానే ఈయన గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. అంతేకాకుండా టిడిపి పత్తాలేకుండా పోయింది. ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, నిరుపేదలకు తోచిన సహాయం ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా వంశీ అన్నింటిలనూ ముందుండేవారు. చాలా కాలం తరువాత వంశీకి విశాఖ వాసులు రుణం తీర్చుకునే అవకాశం రావడంతో అత్యధిక మెజార్టీని అందించి విశాఖ వైఎస్సార్సీపీలో తిరుగులేని నేత ఈయనేనని రుజువుచేసి చూపించారు. ఈ విజయం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలన నేతగా వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఓ వెలుగు వెలిగారు..