విశాఖ జీవిఎంసీపై YSRCP జెండా..


Ens Balu
3
Visakhapatnam
2021-03-14 15:31:06

రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక మహా విశాఖ నగరపాలక సంస్థ పై వెస్సార్సీపీ జెండా ఎగురవేసింది. ప్రత్యర్ధి టిడిపి ఎన్ని కుట్రలు చేసినా, ఎంత రాజకీయం నడిపినా ప్రజలు మాత్రం వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. మేజిక్ ఫిగర్ సంఖ్యలో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు గెలిచి జీవిఎంసీ పీఠాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించినా విశాఖ ప్రజలు తిప్పికొట్టినట్టుగా వైస్సార్సీపీకి ప్రజలు వెన్నదన్నుగా నిలిచారు. విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే వైఎస్సార్సీపీని ఓడించాలని ప్రతిపక్షాలు నెత్తీనోరు కొట్టుకున్నట్టు రాజకీయం చేసినా ఫలితం లేకపోయింది. 55 స్థానాలకు పైగా గెలుచుకొని మహావిశాఖనగర పాలక సంస్థ పీఠాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఆది నుంచి ప్రకటిస్తున్నట్టుగా విశాఖను పరిపాలనా రాజధానిని చేయడానికి జీవిఎంసి గెలుపు కూడా నేడు ఊతమిచ్చింది.  మొత్తం 98 వార్డులకు గాను 55కి పైగా స్థానాలు వైఎస్సార్సీ సొంతం చేసుకొని విజయ దుందుబీ మోగించింది.