రేపు అందరికీ కోవిడ్ ఫస్ట్ డోస్ వేక్సిన్..
Ens Balu
2
Kakinada
2021-06-29 14:22:43
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో బుధవారం హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45 సంవత్సరాలు దాటిన వారికి కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ టీకాలు పంపిణీ చేస్తారని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ టీకా వేయించుకుని 28 రోజుల వ్యవధి పూర్తయిన వారికి రెండవ డోస్ టీకాలు వేస్తారని తెలియజేశారు. జిల్లాలో కోవాగ్జిన్ ఫస్ట్ డోసు తీసుకుని సెకండ్ డోస్ వేయించుకోవలసిన వారు ఇంకా 10 వేల మంది వరకూ ఉన్నారని వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.