సింహాలచంలోని శ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని సీఆర్పీఎఫ్ అడిషనల్ డీజీపీ రష్మీ శుక్లా, సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా, 198 వ బెటాలియన్ కమాండెంట్ కెకె చాంద్ లు బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు స్వామికి ప్రత్యేక పూజలు చేసి, కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు అధికారులకు స్వామి వారి ప్రసాదం తో పాటు వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా ఇటీవలే పరిశుభ్రం చేసిన నరసింహ అవతారాలు వాటి విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. స్థలపురాణం, కళ్యాణ మండపం గురించి ఆలయ సిబ్బంది ఐపీఎస్ అధికారులకు వివరించారు. శిఖర దర్శనం చేసుకుని ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రశంసించారు. వరాహ, నరసింహస్వామి ఒకే అవతారంలో దర్శనమివ్వడం అపురూపమని రష్మీ శుక్లా అభిప్రాయపడ్డారు.