ఎస్ఈబి పై మహిళా పోలీసులకి శిక్షణ..


Ens Balu
2
Prathipadu
2021-06-30 11:57:23

గ్రామ సచివాలయ మహిళా పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో(ఎక్సైజ్ శాఖ) నిర్వహించే కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి వుండాలిని  ప్రత్తిపాడు ఎస్ఈబి సిఐ అజయ్ కుమార్ సింగ్ సూచించారు. బుధవారం 7వ బ్యాచ్ మహిళా పోలీసులకు ఎక్సైజ్ పోలీసు స్టేషన్ లో విధులుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, మహిళా పోలీసులు గ్రామాల్లోని నాటు సారా, అక్రమ మద్యం అమ్మకాలు, సారా తయారీ తదితర విషయాలపై ఎప్పటి కప్పుడు స్టేషన్ కి  సమాచారం అందించాలన్నారు. గ్రామాల్లో సారాఅమ్మకాలు జరగకుండా చూసే బాధ్యత మహిళా పోలీసులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం మధ్య నియంత్రణ విషయంలో ప్రత్యేక ప్రణాళిక తో ముందుకెళుతున్న సమయంలో అన్ని గ్రామాల్లోనూ అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఇందులో భాగంగా సచివాలయ పరిధిలోని మహిళా పోలీసులు ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను పాటిస్తూ, ప్రభుత్వ లక్ష్యాల్లో భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం స్టేషన్ లో ముద్దాయిలపై కేసులు రాసే విధానం,  రికార్డులు, వివిధ మధ్యం కేసుల్లో పట్టుబడ్డవారిని ఏ విధంగా ఖైదు చేస్తారో చూపిస్తూ  సిఐ మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, పిఎస్ఎస్ కళాంజలి, పి.ఉషారాణి, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.