పారిశుధ్య సిబ్బందిని సర్దుబాటు చేయాలి..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-06-30 15:31:30

పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య కార్మికులను సర్దుబాటు చేయాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. బుధవారం ఆయన ఆరవ జోన్ 75వ వార్డు పరిధిలోని పెద్ద గంట్యాడ, నెల్లిముక్కు, పిట్టవాని వీధి తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో సరిపడిన పారిశుధ్య కార్మీకులు ఉన్నారని పిన్ పాయింట్ వారిగా కార్మీకులను సర్దుబాటు చేసి, ఎవ్వరికి నిర్దేశించిన పనిని వారిచే చేయించాలని ఆదేశించారు. కాలువలు, గెడ్డలను పరిశీలించి, గెడ్డలలోని చెత్తను తొలగించి డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. ప్రతి దుకాణం వద్ద 3 రంగుల డస్ట్ బిన్లు ఉండేలా చూడాలన్నారు. దుకాణాదారులు వద్ద ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను పరిశీలించి, నిషేదిత ప్లాస్టిక్ ను వాడరాదని, దుకాణాదరుడు నిషేదిత ప్లాస్టిక్ ను వాడినయడల వారి వద్ద నుండి అపరాదరుసుం వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ని ఆదేశించారు. అనంతరం పెద్ద గంట్యాడ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరుచున్న విధానాన్ని పరిశీలించి అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని సిబ్బందికి సూచించారు. వ్యాక్సినేషన్ వేయించుకొనుటకు వచ్చినవారు కోవిడ్ నిబంధనలు పాటించి వ్యాక్సినేషన్ వేయించుకోవలసినదిగా   కోరారు. ఈ పర్యటనలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వార్డు సచివాలయ శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.