భారత ప్రభుత్వ, గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా స్మార్ట్ సిటీ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా విశాఖపట్నం నుంచి గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సి.ఇ.ఒ./జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన పాల్గొన్నారు. బుధవారం ఆయన ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాలలోని 100 నగరాలలో అమలవుతున్న స్మార్ట్ సిటీ పనులపై ఆరా తీశారు. స్మార్ట్ సిటీ పనులు యొక్క భౌతిక, ఆర్థిక పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ డా. జి.సృజన జివిఎంసిలో స్మార్ట్ సిటీ పనులు దాదాపు పూర్తయ్యాయని, కొన్ని పనులు కోవిడ్-19 కారణంగా కొద్దిగా ఆలస్యం అయ్యాయని వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ విశాఖపట్నంలో స్మార్ట్ సిటీ పనులపై సంతృప్తి వ్యక్తపరుస్తూ, మిగిలిన పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించి నిధులను ఏమైనా రావలసి ఉంటే వెంటనే విడుదల చేస్తామని తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ను జాయింట్ డైరెక్టర్ అండ్ మిషన్ డైరెక్టర్, ఎం.ఒ.హెచ్.యు.ఎ., గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరుపున కునాల్ కుమార్ మోడరేట్ చేయగా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరుపున ఎం.ఎ. & యు.డి. ప్రత్యేక కార్యదర్శి రామ్ మనోహర్ పాల్గొన్నారు.