మధురవాడ డెల్టా ప్లస్ మొదటి కేసు..
Ens Balu
4
Madhurawada
2021-06-30 16:19:25
విశాఖలోని జీవీఎంసీ జోన్ 1 మధురవాడ వాంబేకాలనీలో మొదటి డెల్టా ప్లస్ కేసు నమోదయ్యింది. 51సంవత్సరాల మహిళకు మధురవాడ పి హెచ్ సి లో సిబ్బంది కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. లక్షణాలను గుర్తించి సిబ్బంది మరో సారి శాంపిల్స్ తీసి హైదరాబాద్ ల్యాబ్ పంపారు. అక్కడ పరీక్షచేసిన ల్యాబ్ సిబ్బంది అది డెల్టా ప్లస్ గా రిపోర్టు ఇచ్చారు. హైదరాబాద్ ల్యాబ్ ల్యాబ్ రిపోర్ట్ డెల్టా ప్లస్ గా రావడంతో... వైద్యసిబ్బంది అప్రమత్తం అయ్యారు. వార్డు వాలంటీర్ల సహాయంతో కేసు నమోదు అయిన ప్రాంతంతోపాటు చుట్టు పక్కల ప్రదేశాలను శానిటేషన్ చేసి బారికేడ్లతో పరిసర ప్రాంతాలను మూసివేసారు. మరింత సమాచారం తెలియాల్సి వుంది..