డెల్టా ప్లస్ కాదు డెల్టా వేరియంట్ మాత్రమే..


Ens Balu
2
Visakhapatnam
2021-06-30 16:33:42

విశాఖలోని  జీవీఎంసీ జోన్ 1 మధురవాడ వాంబేకాలనీలో మొదటి డెల్టా ప్లస్ కేసు నమోదయ్యిందనే విషయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. డెల్టా ప్లస్ అంటూ జరిగే ప్రచారంపై జిల్లా వాసులెవరూ కంగారు పడొద్దని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. ఆ కేసు  డెల్టా వెరియంట్ మాత్రమేనని వివరించారు. ఈ మేరకు బుధవారం రాత్రి మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సెకెండ్ వేవ్ లో చాల మందికి ఈ విధంగా ఫలితం వచ్చిందని..ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం డెల్టా ప్లస్ కలవరం పెడుతున్న నేఫథ్యంలో పాజిటివ్ వచ్చిన సాంపిల్స్ హైద్రాబాద్ పంపి ఫలితాలు వచ్చాక నిర్థారణ చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన  ఆమె పరిస్థితి బాగానేఉందన్న డిఎంహెచ్ఓ ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.