ఇరిగేషన్ శాఖ మంత్రి జిల్లాకు రాక..
Ens Balu
5
Srikakulam
2021-07-01 11:49:49
రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనీల్ కుమార్ శుక్రవారం జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 08.00గం.లకు విశాఖపట్నంలో బయలుదేరి ఉదయం 11.00గం.లకు వంశధార ఫేజ్ –2 వద్దకు చేరుకుంటారు. అక్కడ ఫేజ్ –2 క్రింద జరుగుతున్న స్టేజ్ –2 పనులను తనిఖీచేస్తారని కలెక్టర్ చెప్పారు. అక్కడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.30గం.లకు శ్రీకాకుళంకు చేరుకుంటారు. మధ్యాహ్నం 02.00గం.లకు మాజీ మంత్రివర్యులు మరియు శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు గారిని సందర్శించనున్నారు. సాయంత్రం 04.00గం.లకు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్న ఆయన సాయంత్రం 05.00గం.లకు ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.