వైద్యవిద్యార్ధుల రక్తదానం స్పూర్తిదాయకం..


Ens Balu
3
కెజిహెచ్
2021-07-01 12:09:11

కరోనా విపత్కర సమయంలో రక్తం దానం చేయడానికే జూనియర్ డాక్టర్లు ముందుకి రావడం శుభ పరిణామమని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రన్సిపాల్ డా.సుధాకర్ పేర్కొన్నారు.  గురువారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఏఎంసీలో జరిగిన కార్యక్రమంలో జూనియర్ వైద్యులు 30 మంది రక్తదానం చేశారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, వైద్య విద్య చదువుకునే సమయంలోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టే వైద్యులకు మంచి భవిష్యత్తు వుంటుందన్నారు. ఒకరు రక్తదానం చేయడం ద్వారా 8 మంది ప్రాణాలు కాపాడవచ్చుననే నినాదంతో వైద్యవిద్యార్ధులు చేస్తున్న ఈ రక్తదాన కార్యక్రమం ఎందరికో స్పూర్తిగా వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఏ.శ్యామలాదేవి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రాజ్ గ్రుబక్షాని తదితరులు పాల్గొన్నారు..