సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారికి విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన గోపి. జగన్మోహన్ రావు లక్ష ఒక్క రూపాయలు (రూ. 1,00,001) విరాళం అందించారు. గురువారం దేవస్థానంలోని పీఆర్వో కార్యాలయ కౌంటర్ లో చెక్ అందించారు. తన భార్య గోపి,రాధ ప్రధమ వర్దంతి 09-07-2021 జరుగుతోందని ఆరోజు ఆమె జ్ఞాపకార్థం ఈ నెల 9 వ తేదీన అన్నదానం చేయాలని కోరారు. అంతేకాకుండా తమ పెళ్లి రోజైన 20-04-21న కూడా అన్నదానం చేయాలని గోపి.జగన్మోహన్ రావు కోరారు. స్వామివారి దయతో తమ ఇద్దరు కొడుకులుఅమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా సెటిలయ్యారని ఆయన చెప్పారు. అంతకు ముందు స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రశాదాలతోపాటు, వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.