ఉన్నత పదవితో "ఉమాకాంత్" మళ్ళీ రావాలి..


Ens Balu
5
విశాఖ సిటీ
2021-07-01 12:50:01

విశాఖ సాక్షి బ్యూరో చీఫ్ గా  గరికిపాటి ఉమాకాంత్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారని లీడర్ పత్రిక సంపాదకులు వివి.రమణమూర్తి కొనియాడారు. విశాఖపట్నం నుండి తిరుపతికి  బదిలీ అయిన సందర్భంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం సాక్షి బ్యూరో చీఫ్ ఉమాకాంత్ కి ఘనంగా సత్కరించారు. వి జె ఎఫ్ పాలకవర్గం ఆయనకు శాలువా కప్పి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  రమణమూర్తి పాల్గొని మాట్లాడారు. విశాఖలో అడుగు పెట్టింది మొదలు ప్రజా సమస్యలపై,  పార్టీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అనేక వార్తలు వ్రాసి మన్నలను పొందారన్నారు. ప్రజలకు ఇటు పార్టీకి చక్రంలా పనిచేయడం సామాన్య విషయం కాదన్నారు. ఎంతో సున్నితమైన, కల్మషం లేని ఉమాకాంత్ మరింత ఉన్నత పదవిలో మళ్ళీ త్వరలోనే విశాఖ కు రావాలని ఆకాంక్షించారు. వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, అందరితో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని వి జి ఎఫ్ కుటుంబ సభ్యుడిగా కలిసి ఐదేళ్ళు గడిచాయన్నారు. అప్పన్న పాదాల చెంత నుండి తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులతో అక్కడికి బదిలీ కావడం ఆనందంగా ఉందన్నారు. ఆయన రాసిన వార్తలు పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది అని కొనియాడారు. సాక్షి బ్యూరో చీఫ్ ఉమాకాంత్ మాట్లాడుతూ  తన 27ఏళ్ల జర్నలిజంలో ఎక్కువ కాలం పని చేసింది వైజాగ్ లోనే అన్నారు. అనేక జిల్లాల్లో పనిచేసి  ఐదేళ్ల క్రితం వైజాగ్ కు ట్రాన్స్ఫర్ అయిందన్నారు. కానీ ఇక్కడికి  ఇష్టపడి రాలేదని, వైజాగ్ బదిలీ లోనే తన తండ్రి చనిపోయారు అని గుర్తు గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు విశాఖను వదిలి వెళ్లడం చాలా బాధ కలిగిస్తుందన్నారు.  విశాఖ లో అడుగుపెట్టిన మొదటి రోజే యుగంధర్ రెడ్డి, మీడియా లెజెండ్ రమణ మూర్తి ని కలవడం జరిగిందన్నారు. అలాగే వీ జే ఎఫ్ తో కూడా మంచి తత్స సంబంధాలు ఏర్పడ్డాయి అన్నారు. తను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ఉమాకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, డాక్టర్ రామ్ కుమార్, వీ జే ఎఫ్ కార్యదర్శి చోడిశెట్టి దుర్గారావు, ఉపాధ్యక్షుడు నాగరాజు పట్నాయక్, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, ఈరోతి ఈశ్వర్ రావు, ఎమ్మెస్సార్ ప్రసాద్, పైల దివాకర్ , మాధవ్, గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.