గండి పోచమ్మ అమ్మవారి దయతో పర్యాటక ప్రాంతాలు, గోదావరి నదీ ఆలయాలు అభివ్రుద్ధి చెందాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం మంత్రి గండి పోచమ్మ వారిని దర్శించుకుని అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గోదావరి జల హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించి పాపికొండలు విహార యాత్ర పున ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి పరచి భవిష్యత్ తరాలకు అందిస్తామన్నారు. గోదావరి తీరం వెంబడి పర్యాటకుల తాకిడి కి అనుగుణంగా బోటింగ్ పాయింట్లు పెంచామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఎక్కడ నిర్లక్ష్యానికితావులేకుండా పలురకాల శిక్షణలో ఇప్పించి ఆయా శిక్షణ పొందిన వారిని ఈ లాంచీల లో నియమించినట్టు చెప్పారు. స్థానిక శాసన సభ్యురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ. ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యానికి తావులేకుండా విహారయాత్ర కొనసాగేలా పర్యవేక్షణ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిందన్నారు . రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా మాట్లాడుతూ పర్యాటకం అనగానే తూర్పుగోదావరి జిల్లా అందరి దృష్టిని ఆకర్షిస్తోందని పురుషోత్తపట్నం రామవరపు ఆవ ప్రాంతాన్ని ఏనుగు కొండ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని పర్యాటక మంత్రి ని కోరారు. రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు చోట్ల పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి పరిచి 6 స్టార్ హోటల్స్ నిర్మించాలని యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. అదేవిధంగా ప్రముఖ దేవాలయాలు కలిగిన ఏడు ప్రాంతాలకు అభివృద్ధి పరచి పర్యాటకంగా ఆదాయాన్ని ఆర్జించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ మాట్లాడుతూ జిపిఎస్ అనుసంధానంతో పర్యాటక రక్షణ వ్యవస్థ బలోపేతం చేయడం జరిగిందని కాకినాడ మచిలీపట్నం పోర్టు ల ద్వారా లైసెన్సులు ఇవ్వడం జరుగుతుందని ఆయ కోర్టుల మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ అనంత బాబు ఐ టి డిఎ వివో ప్రవీణ్ ఆదిత్య సబ్ కలెక్టర్ సింహాచలం పర్యాటక శాఖ సిబ్బంది రమణ మురళి తదితరులు పాల్గొన్నారు.