సీఎస్ఆర్ నిధులు ఉపాది చూపాలి..


Ens Balu
2
Tangutur
2021-07-01 13:34:19

సిఎస్ఆర్ నిధులు సక్రమంగా వినియోగిస్తే ఎందరికో దారిచూపిస్తాయని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. గురువారం టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో ఈనెల 1వ తేదీన స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ సహకారంతో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని,  వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఆయన గ్రామ సర్పంచ్ మన్నం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్  కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ లో భాగంగా 9 లక్షల రూపాయల విలువ చేసే 45 కుట్టుమిషన్ లను అందించడం 45 మంది మహిళలకు ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు.స్పందన డైరెక్టర్ వి.శివరామిరెడ్డి ప్రసంగిస్తూ కారుమంచి గ్రామ అభివృద్ధి లో తమ తోడ్పాటు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు.అనంతరం జరిగిన వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా జరిగిన సభలో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ కరోనా నేపథ్యంలో దాదాపు 800 మంది డాక్టర్లు మరణించడం బాధాకరమన్నారు.వందలాది వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యసేవలను అందించారన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 16 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం,కరోనా నేపథ్యంలో 1.3 లక్షల కోట్ల రూపాయలను నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుల అకౌంట్స్ లో వేయడం  అభిలషణీయన్నారు.జులై 1 న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రాణాలను అర్పించిన వైద్య సిబ్బందికి సంతాపం తెలుపుతూ సభ మౌనం పాటించింది.వ్యాక్సినేషన్ ల ఫలితంగా ప్రపంచంలో మశూచి, కలరా, పోలియో, ప్లేగు లాంటి వ్యాధులను నిర్మూలించగలిగామని నేడు కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ను అందరూ వేయించుకోవడమే పరిష్కారమని లక్ష్మణరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నం శ్రీనివాస్,ఉప సర్పంచ్ ముంతా లక్ష్మి, గ్రామ పెద్దలు బత్తుల కృష్ణ, చిట్టేల రామిరెడ్డి,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డి.ఎన్ వెంకటేశ్వర్లు, సూపర్ వైజర్ వి.ఝాన్సీలక్ష్మి,లేజియా రాణి, హెల్త్ అసిస్టెంట్ సురేష్,వార్డు నెంబర్ లు ప్రసంగించారు.
సిఫార్సు